భారతదేశం, మే 15 -- సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల్లో 100 శాతం మార్కులు సాధించి టాపర్స్ లో ఒకరుగా నిలిచిన హర్యానాలోని పంచకులకు చెందిన సృష్టి శర్మ రోజుకు 17 నుంచి 18 గంటలు చదివేదాన్నని, ఒక్కో రోజు 20 గంటలు కూడా చదువుకున్న రోజులు ఉన్నాయని చెప్పింది. మరో టాపర్ మహారాష్ట్రలోని నాగపూర్ కు చెందిన శంకరి కే జాధవ్ మాత్రం తాను తనకు చదవాలని అనిపించినప్పుడే చదివానని, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటానని చెప్పింది. ఈ ఇద్దరి ప్రిపరషన్ స్టైల్ ను చూద్దాం.

తాను ట్యూషన్ లేదా కోచింగ్ క్లాసులపై ఆధారపడలేదని, బదులుగా రోజుకు 17 నుండి 18 గంటలు,.కొన్నిసార్లు 20 గంటలు కూడా చదివానని సృష్టి శర్మ చెప్పారు. ''నాకు చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబాన్ని, ఉపాధ్యాయులను గర్వపడేలా చేశాను. నేను ఎప్పుడూ ట్యూషన్ కు వెళ్లలేదు. రోజుకు 20 గంటలు చదివేదాన్ని. నేను ఆత్మవిశ్వాసం తక్కువ....