భారతదేశం, డిసెంబర్ 26 -- రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. అలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు వివరణలతో కూడిన ప్రకటనను విడుదల చేసింది.

రైతు భరోసా కింద తెలంగాణ వ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారని వ్యవసాయశాఖ పేర్కొంది. ఆ పథకాన్ని ప్రభుత్వం ఆపడం లేదని. నిలిపివేయడం లేదని వివరించింది. ప్రస్తుతం సంబంధిత జిల్లా కమిటీలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పంట పెట్టుబడి సహాయం అందేలా చూసుకోవడానికి గ్రౌండ్ వెరిఫికేషన్ ను నిర్వహిస్తున్నాయని వెల్లడించింది.

ఆర్ధిక శాఖ కూడా లబ్ధిదారులకు చెల్లింపులు చేయడం కోసం వారి జాబితాను సిద్ధం చేసి తిరిగి తనిఖీ కూడా నిర్వహిస్తోంది. రైతు భరోసా నిలిపివేస్తున్నారని అని ప్రచారమవుతున్న వార్తలు ...