భారతదేశం, ఏప్రిల్ 15 -- అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ, బాధితురాలిని ఉద్దేశించి అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా, ఆ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కూడా స్పందించింది. ఆ వ్యాఖ్యలు చాలా దారుణంగా, ఇన్ సెన్సిటివ్ గా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలను తప్పుబట్టింది. గతంలో కూడా ఒక అత్యాచారం కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పును, ఆ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పు పట్టిన విషయం తెలిసిందే.

ఉత్తర ప్రదేశ్ లోని ఒక స్థానిక యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్న యువతి స్నేహితురాళ్లతో కలిసి బార్ కు వెళ్లింది. అక్కడ అతిగా మద్యం సేవించి, సొంతంగా ఇంటికి వెళ్లలేని పరిస్థితుల్లో, అదే బార్ లో పరిచయమైన వ్యక్తితో కలిసి అ...