భారతదేశం, నవంబర్ 7 -- కైండ్ ఇండియా సంస్థ తన కొత్త ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ KindIndia.in ను ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వెరిఫైడ్ ఎన్జీఓలు, దాతలను ఒకే వేదికపైకి తీసురానుంది. భారతీయ సమాజంలో అతిముఖ్యమైన దయ, దాతృత్వ విలువలను తిరిగి ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందించబడింది.

కేవలం రూ.100 నుంచి మొదలయ్యే విరాళాలతో.. "100 రూపాయల చారిటీ రెవల్యూషన్" అనే కొత్త ఉద్యమానికి కైండ్ ఇండియా నాంది పలుకుతోంది. దీని ద్వారా కేవలం రూ. 100 తోనే దాతృత్వంలో భాగస్వామ్యం అవ్వొచ్చు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఆలయాలు, విద్యాసంస్థలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు వంటి విభిన్న రంగాలకు చెందిన ఎన్జీఓలను ఏకతాటిపైకి తీసుకువస్తూ కైండ్ ఇండియా చారిటీని అందరి దైనందిన జీవితంలో భాగంచేయాలనేదే దీని ప్రధాన ఉద్దేశ్యం.

"మనం ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్స్‌ లో ఎంత ...