Telangana,delhi, సెప్టెంబర్ 10 -- భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి వెంట‌నే అనుమ‌తులు మంజూరు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం కూడా తెలంగాణ‌ - ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానుల మ‌ధ్య గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మించాల్సి ఉంద‌ని గుర్తుచేశారు.

తెలంగాణ‌కు స‌ముద్ర రేవు లేనందున, బంద‌రు పోర్ట్ వ‌ర‌కు స‌ర‌కు ర‌వాణాకు వీలుగా గ్రీన్ ఫీల్డ్ ర‌హ‌దారి మంజూరు చేయాల‌ని కోరారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారిలో 118 కిలోమీటర్లు తెలంగాణ‌లో మిగ‌తా భాగం ఏపీలో ఉంటుంద‌ని వివ‌రించారు. మంగళవారం పలువురు ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌...