Telangana, సెప్టెంబర్ 3 -- బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావ్, సంతోష్ రావులను దూరం పెట్టాలని పార్టీ నాయకత్వాన్ని కోరారు. హరీశ్ రావ్, సీఎం రేవంత్ కలిసి ఓకే విమానంలో ప్రయాణం చేశారని.. ఆ తర్వాతనే మా కుటుంబపై కుట్రలు స్టార్ట్ అయ్యాయని చెప్పుకొచ్చారు. ఇవాళ తనను బయటికి పంపొచ్చని. రేపు కేటీఆర్ పై కూడా కుట్ర జరుగుతుందని వ్యాఖ్యానించారు.

"నా తండ్రి చిటికెన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నా. కేసీఆర్‌ నుంచే సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నా. నాన్న.. మీ చుట్టు ఏం జరుగుతోంది చూస్కోండి. నేను మొన్న చెప్పిన ఇద్దరు నేతలు నాపై చిలువలు పలువలుగా ప్రచారం చేశారు. గులాబీ పార్టీ కండువా కప్పుకుని పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాడడం పార్టీ వ్యతిరేకమా..? నాపై కుట్రలు జరుగుతుంటే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా...