Andhrapradesh,vijayawada, ఏప్రిల్ 18 -- ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్‌ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న ఆయన. ఇవాళ విజయవాడలోని సిట్ కార్యాలయానికి వచ్చారు. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడారు. పార్టీలోని కొందరు పెద్దలు రాజ్ కసిరెడ్డిని తనకు పరిచయం చేశారని వెల్లడించారు. రాజ్ కసిరెడ్డిని తాను ఎంకరేజ్ చేసిన మాట వాస్తవమే అని వ్యాఖ్యానించారు. అతను ఇంత దారుణంగా మోసం చేశాడంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు.

"రాజ్ కసిరెడ్డిని నేను ఎంకరేజ్ చేసిన మాట వాస్తవమే. పార్టీలోని కొందరు పెద్దలు రాజ్ కసిరెడ్డిని నాకు పరిచయం చేశారు. ఆయన ఒక తెలివైన క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి. అతను క్రిమినల్ అని తెలియక నేను అతన్ని ఎంకరేజ్ చేశాను. వైసీపీలో రాజ్ కసిరెడ్డికి అత్యంత కీలకమైన బాధ్యతలు నేనే అప్పగించాను. అతను నన్ను ఇంత దారుణంగా...