Telangana, మే 13 -- తెలంగాణ రాజీవ్ యువ వికాసం స్కీమ్ దరఖాస్తుదారులకు శుభవార్త వచ్చేసింది. సిబిల్ స్కోర్ ఆధారంగా అర్హుల ఎంపిక ఉంటుందన్న ప్రచారానికి తెర పడింది. ఇదే విషయంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేశారు.

రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక సిబిల్ స్కోర్ ఆధారంగా జరుగుతుందని చేస్తున్న ప్రచారం అవాస్తవమని భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు వరంగా రాజీవ్ యువ వికాసం పథకం తీసుకువచ్చామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు రాజకీయాల కోసం యువత జీవితాలతో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

రాజీవ్ యవ వికాసం అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా. వేగంగా జరుగుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి నియోజకవర్గాల వారీగా శాంక్షన్ లెటర్ల పంపిణీ జరుగుతుందన్నారు. అభ్యర్థులు ధైర్యంగా ఉండాలని. తప్ప...