భారతదేశం, నవంబర్ 7 -- భారత ప్రధాని నరేంద్ర మోదీని 'గొప్ప మనిషి', 'మిత్రుడు' అంటూ కొనియాడారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా.. వచ్చే ఏడాది తాను భారత్‌ను సందర్శించే అవకాశం ఉందని ఆయన హింట్ ఇచ్చారు.

వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. బరువు తగ్గించే ఔషధాల ధరలు తగ్గించేందుకు ఉద్దేశించిన కొత్త ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత, ప్రధాని మోదీతో తన చర్చలు అద్భుతంగా సాగుతున్నాయని ట్రంప్ అన్నారు.

"ఆయన (ప్రధాని మోదీ) రష్యా నుంచి కొనుగోలును చాలా వరకు తగ్గించారు. ఆయన నాకు మిత్రుడు. మేము మాట్లాడుకుంటూ ఉంటాం, ఆయన నన్ను అక్కడికి (భారత్‌కు) రావాలని కోరుకుంటున్నారు. మేం దాన్ని ఖరారు చేస్తాం, నేను వెళతాను.. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి. నేను తప్పకుండా భారత్‌కు వెళతాను," అని ...