భారతదేశం, మే 11 -- గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలోని ప్రజల కోసం జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలు రకాల పౌర సేవలను అందించడానికి 'మై జీహెచ్‌ఎంసీ' మొబైల్‌ యాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా అందించే సేవలను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వి కర్ణన్‌ వివరించారు. నగర పౌరులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని.. అరచేతి నుంచే సేవలను పొందాలని సూచించారు.

1.ఈ యాప్‌ ద్వారా పారిశుద్ధ్యం, ఇంజినీరింగ్, ఆరోగ్యం, వీధి దీపాలు, మురుగునీటి సమస్య, రహదారులను ఊడ్చడం వంటి సమస్యలపై ఫిర్యాదు చేయాల్సి వస్తే.. ఫొటో తీసి సమస్య ఉన్న ప్రాంతం నుంచే ఫిర్యాదు చేయవచ్చు.

2.పౌరులు పంపిన ఫొటోలను కంట్రోల్‌ రూమ్ నుంచి పరిశీలిస్తారు. యాప్‌లో ఫిర్యాదు నమోదైన ప్రాంతానికి సంబంధిత అధికారులను పంపిస్తారు.

3.ఫిర్యాదు చేసిన వ్యక్తి మొబైల్‌కు కంప్లైంట్ నంబర్, సంబంధిత అధికారి ఫోన్‌ నె...