భారతదేశం, జూలై 6 -- అమెరికా అధ్యక్షుడు తీసుకొచ్చిన బిగ్​ బ్యూటిఫుల్​ బిల్లకు ఆమోదం లభిస్తే కొత్త పార్టీ పెడతానని హెచ్చరించిన అపర కుబేరుడు ఎలాన్​ మస్క్..​ చెప్పింది చేశారు! రిపబ్లికన్​, డెమొక్రటిక్​లకు ప్రత్యామ్నాయంగా 'అమెరికా పార్టీ' అనే మూడో రాజకీయ పార్టీని మస్క్​ తాజాగా లాంచ్​ చేశారు.

సోషల్ మీడియాలో వచ్చిన సూచనలకు సానుకూలంగా స్పందించిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, తన ప్లాట్‌ఫామ్ ఎక్స్​ వినియోగదారుల నుంచి అఖండ మద్దతు లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

"మీరు కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు. అది మీకు లభిస్తుంది! ఈ రోజు, మీకు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది," అని ఎలాన్​ మస్క్​ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.

ఒకప్పటి కీలక మిత్రుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మస్క్​కి పెరుగుతున్న బహి...