Telangana, జూలై 19 -- రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇలా ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని చెప్పుకొచ్చారు.

తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరని ట్వీట్ చేశారు. కోమటిరెడ్డి ట్వీట్ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....