భారతదేశం, ఆగస్టు 3 -- బీఆర్ఎస్ పార్టీలో మరోసారి కవిత వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా సొంత పార్టీలోని పలువురు నేతలను ఉద్దేశిస్తూ కవిత తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పార్టీలో కుట్రదారులున్నారంటూ ఆరోపిస్తున్నారు. బీజేపీలో విలీనం చేసే కుట్ర కూడా జరిగిందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె. తెలంగాణ జాగృతి పేరుతో సొంతంగానే కార్యక్రమాలు చేస్తున్నారు.

కవిత వ్యవహారంపై పార్టీలోని పలువురు నేతలు ఇటీవలే స్పందించారు. ఇందులో జగదీశ్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కవిత. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ లేకుంటే ఈ లిల్లీపుట్ ఎవరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లాలో పార్టీ ఓటమికి కారణమైన లిల్లీపుట్ నేత నా గురించి మాట్లాడుతారా? అంటూ ప్రశ్నించారు...