భారతదేశం, సెప్టెంబర్ 27 -- జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలుష్య కారకాలను విడుదల చేస్తున్న అరబింద్ ఫార్మా యూనిట్ పై కాలుష్య నియంత్రణ మండలి ఒక రోజులో చర్యలు తీసుకోకపోతే యూనిట్ ను తగలబెడతాని వార్నింగ్ ఇచ్చారు.

గతంలో అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తినప్పటికీ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. "అరబిందోపై చర్యలు తీసుకునేందుకు పీసీబీకి ఒక్క రోజే గడువు ఇస్తున్నాను. స్పందించకపోతే ఆదివారం ఉదయం 11 గంటలకు నేను స్వయంగా అక్కడికి వెళ్లి పరిశ్రమను కాలబెడతాను" అంటూ ఓ వీడియోను విడుదల చేశారు.

తన నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరిగితే సహించలేనని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. కాలుష్య బోర్డుకు ఫిర్యాదులు సమర్పించడానికి, మీడియాకు ప్రకటనలు చేయడానికి ఇంకా ఓపిక లేదని వ్యాఖ్యానించారు....