భారతదేశం, నవంబర్ 19 -- ఇటీవలే లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఓ వీడియోను విడుదల చేశారు. మావోయిస్టులు లొంగిపోవాలని కోరారు. పరిస్థితులు మారుతున్నాయని. దేశం‌ కూడా మారుతోందని అభిప్రాయపడ్డారు.

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో పాటు పలువురి ప్రాణాలు పోయాయని. ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు.

అడవిలో ఉన్న దళ సభ్యులు కూడా ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని మల్లోజుల పిలుపునిచ్చారు. లొంగిపోయే దళ సభ్యులు తనను సంప్రదించొచ్చని తెలిపారు. ఈ మేరకు తన ఫోన్‌ నంబర్‌ 8856038533 ను ప్రకటించారు.

శాంతిస్థాన కోసం విజ్ఞప్తి చేసిన మల్లోజుల. మిగిలిన మావోయిస్టులు లొంగిపోవాలని కోరారు. సమాజంలో తిరిగి కలిసిపోవాలని. కొత్త జీవితాలను ప్రారంభించడానికి ప్రభుత్వ పునరావాస పథకా...