భారతదేశం, నవంబర్ 20 -- మావోయిస్టు అగ్రనేతలుగా పేరొందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి బంధువులు గురువారం హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దేవ్ జీ సోదరుడు తిప్పిరి గంగాధర్ (55), రాజిరెడ్డి కుమార్తె స్నేహలత (55) ఈ పిటిషన్ దాఖలు చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలో నవంబర్ 18న ఆరుగురు, నవంబర్ 19న ఏడుగురు మావోయిస్టులు ఎన్ కౌంటర్ అయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కీలక నేతలైన దేవ్ జీ, రాజిరెడ్డి కూడా ఏపీ పోలీసుల అదుపులోనే ఉన్నారన్న వార్తలు బయటికి వచ్చాయి. దేవ్ జీకి భద్రత కల్పించే సభ్యులు ఏపీలో అరెస్ట్ కూడా అయ్యారు. మారేడుమిల్లి ఎన్ కౌంటర్ తో పాటు ఏకకాలంలో చాలా మంది మావోయిస్టుల అరెస్ట్ వంటి పరిణామాలు దేవ్ జీ ఏపీ పోలీసుల అదుపులోనే ఉన్నాడన్న అనుమానాలకు బలం చేకూర్చాయి.

ఈ నేపథ్యంలోనే దేవ్ జీ...