Telangana,hyderabad, జూలై 12 -- భారత న్యాయ వ్యవస్థ ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు.

విద్యార్థులు స్కాలర్ షిప్ లపై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని సీజేఐ సూచించారు. కుటుంబ ఆర్థిక స్థితిగతులపై ఒత్తిడి తీసుకురావద్దన్నారు. విదేశీ డిగ్రీలతో మన టాలెంట్‌ పెరుగుతుంది అనుకోవద్దని చెప్పారు. మనమేంటో మన పనే చెబుతుంద్న సీజేఐ.. మన దేశంలో నాణ్యమైన న్యాయవిద్య ఉందని వ్యాఖ్యానించారు.

'మన దేశంలోని న్యాయవ్యవస్థ ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ట్రయల్స్ లో జాప్యం కొన్నిసార్లు దశాబ్దాల పాటు ఉంటుంది. అండర్ ట్రయల్ ఖైదీగా ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపిన తర్వ...