Hyderabad,telangana, ఏప్రిల్ 16 -- భూముల నిర్వహణతో పాటు రిజిస్ట్రేషన్ల వంటి అంశాలను చూసే ధరణి స్థానంలో 'భూ భారతి' వచ్చేసింది. ఏప్రిల్ 14వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పోర్టల్ ను ప్రారంభించింది. ముందుగా రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా సేవలు ప్రారంభమయ్యాయి.

భూ భారతి పోర్టల్ పైలెట్ ప్రాజెక్ట్ కోసం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం, నారాయణ పేట జిల్లా మద్దూరు మండలాలను ఎంపిక చేశారు. ఈ నాలుగు మండలాల్లో భూ భారతి పోర్టల్ ద్వారానే భూముల క్రయవిక్రయాలు జరగనున్నాయి. అయితే ధరణి ప్లేస్ లో వచ్చిన భూ భారతి పోర్టల్ లో ఎలాంటి సేవలు, ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి...

కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి పోర్టల్ లో సేవలను రెండు విభాగాలుగా వర్గీకరించారు. ఇందులో భాగంగ...