Telangana, ఏప్రిల్ 19 -- తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చింది. భూ భారతి చట్టంతో పాటు భూ భారతి పోర్టల్ కూడా ప్రారంభమైంది. భూముల నిర్వహణతో పాటు రిజిస్ట్రేషన్ల వంటి అంశాలన్నీ కూడా భూ భారతి పోర్టల్ ఆధారంగానే జరగనున్నాయి. ఏప్రిల్ 14వ తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్ట్ గా నాలుగు మండలాల్లో మాత్రమే సేవలు ప్రారంభమయ్యాయి.

త్వరలోనే రాష్ట్రంలోని అన్ని మండలాల్లో భూ భారతి సేవలు అందుబాటులోకి వస్తాయి. అయితే కొత్తగా వచ్చిన ఈ పోర్టల్ లో లావాదేవీ సేవలతో పాటు సమాచార సేవలు ఉన్నాయి. లావాదేవీల విభాగంలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్, నాలా, అప్పీల్, భూముల వివరాలతో పాటు ఇతర సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఇక సమాచార సేవల్లో చూస్తే భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు, ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలను తెల...