భారతదేశం, మే 13 -- పంజాబ్ లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించారు. అక్కడ ప్రసంగిస్తూ, పాకిస్తాన్ కు, ఉగ్రవాదులకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ''ఇళ్లల్లోకి దూరి మరీ చంపేస్తాం'' అని మరోసారి హెచ్చరించారు. రెండు రోజుల క్రితం అమెరికా మధ్యవర్తిత్వంలో భారత్, పాక్ లు కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో, ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఉగ్రవాదులను హతమార్చడానికి తాము వారి ఇళ్లల్లోకి సైతం అడుగుపెట్టడానికి వెనుకాడబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ''హమ్ ఘర్ మే ఘుస్ కర్ మారేంగే ఔర్ బచ్నే కా ఏక్ మౌకా తక్ నహీ దేంగే.'' (ఇంటింటికి వెళ్లి మరీ హతమారుస్తాం. వారు తప్పించుకునే అవకాశం కూడా ఇవ్వబోం) అని హెచ్చరించారు. "మేము గాడ్ ఫాదర్ లు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రభుత్వ మద్దతుదారుల మధ్య తేడా...