భారతదేశం, జనవరి 13 -- భారతదేశం అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని, ఇండియాకు మించిన దేశం మరొకటి లేదని అమెరికా రాయబారిగా నామినేట్ అయిన సెర్గియో గోర్ వెల్లడించారు. మంగళవారం (జనవరి 13) నుంచి ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన తదుపరి విడత చర్చలు పునఃప్రారంభం కానున్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా రాయబార కార్యాలయంలో దక్షిణాసియా, మధ్య ఆసియా ప్రత్యేక ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్న గోర్.. వచ్చే ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని కీలక సంకేతాలిచ్చారు.

దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో మాట్లాడిన గోర్.. ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఉన్న స్నేహం "నిజమైనది" అని అభివర్ణించారు. నిజమైన మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండటం సహజమని, అయితే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవడంలోనే గొప్పతనం ఉం...