భారతదేశం, నవంబర్ 21 -- "అంతరిక్ష ప్రయాణం కన్నా బెంగళూరు ట్రాఫిక్​ కష్టమైన జర్నీ" అని చమత్కరించారు వ్యోమగామి- ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా. ఈ మేరకు గురువారంతో ముగిసిన బెంగళూరు టెక్​ సమిట్​ 2025లో ఈ వ్యాఖ్యలు చేశారు.

సమ్మిట్‌లో తన సెషన్‌ను ప్రారంభించినప్పుడు, సరదాగా ఒక వ్యాఖ్య చేశారు శుక్లా.

"అంతరిక్షం నుంచి తిరిగి రావడం కంటే, బెంగళూరులో ప్రయాణించడమే చాలా కష్టమైన పని," అని చమత్కరించారు.

శుక్లా మాట్లాడుతూ.. తాను మారాఠాహళ్లి నుంచి బయలుదేరానని, అయితే సమ్మిట్ వేదికకు చేరుకోవడానికి "నా ఈ ప్రెజెంటేషన్ సమయం కంటే మూడు రెట్లు ఎక్కువ" పట్టిందని చెప్పారు. "నా నిబద్ధతను మీరు అభినందించాలి" అని ఆయన జోక్​ చేయగా, ప్రేక్షకులందరూ నవ్వుకున్నారు.

శుక్లా చేసిన ఈ వ్యాఖ్య ఆ తర్వాత, మరో వేదికపై కూడా వినిపించింది. ఫ్యూచర్ మేకర్స్ కాన్‌క్లేవ్‌లో తన ప్రస...