భారతదేశం, ఏప్రిల్ 29 -- జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో సుమారు వారం క్రితం జరిగిన ఉగ్రదాడి రిపోర్టింగ్ లోబ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) మరోసారి తన వక్రబుద్ధిని చూపించుకుంది. దాంతో, భారత్ లో తీవ్ర విమర్శల పాలైంది. ఏప్రిల్ 22న పహల్గామ్ సమీపంలోని బైసరన్ పచ్చిక మైదానంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మరణించారు.

పహల్గామ్ దాడి విషయంలో బీబీసీ కవరేజ్ తీవ్ర విమర్శల పాలైంది. ఆ ఉగ్రదాడిని కవర్ చేయడంలో బీబీసీ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ భారత ప్రభుత్వం బీబీసీకి అధికారిక లేఖను జారీ చేసింది. ముఖ్యంగా ఉగ్రవాదులను మిలిటెంట్లుగా అభివర్ణించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని అధికారులు హిందూస్తాన్ టైమ్స్ తో ధ్రువీకరించారు. మరోవైపు, బీబీసీ తీరుపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీబీసీని భారత్ లో నిషేధ...