Telangana, జూలై 17 -- గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ కరెక్టే అని వ్యాఖ్యానించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె. బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారని. అది సరైందని కాదని చెప్పుకొచ్చారు. వాళ్ళు నా దారికి రావాల్సిందే. నాలుగు రోజులు టైం తీసుకుంటారేమో అంతే' అంటూ కామెంట్స్ చేశారు.

"2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే. నేను న్యాయనిపుణుల తో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్ కు సపోర్ట్ చేశాను. బీసీ రిజర్వేషన్లపై రెండు బిల్లులు పెట్టాలని మొదట డిమాండ్‌ చేసింది కూడా నేనే" అని కవిత గుర్తు చేశారు.

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించేలదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్...