భారతదేశం, నవంబర్ 20 -- మహిళలు, శిశువుల ఆరోగ్య సంరక్షణ కృషి చేస్తున్న అంకుర హాస్పిటల్స్.. ఆయు ఫౌండేషన్ సహకారంతో దేశవ్యాప్తంగా 'ప్రీమెథాన్ 2025'ను ప్రారంభించింది. నెలలు నిండకుండానే పుట్టే (Premature Births) శిశువుల గురించి జాతీయ స్థాయిలో అవగాహన కల్పించడానికి ఈ వాకథాన్‌ను ఆరు నగరాల్లో నిర్వహించారు.

ఈ చొరవ అకాల ప్రసవాల చుట్టూ ఉన్న వైద్యపరమైన, భావోద్వేగ, సామాజిక సవాళ్లను వెలుగులోకి తెచ్చింది. అదే సమయంలో, ఈ పసిపోరాట యోధుల, వారి కుటుంబాల ధైర్యాన్ని వేడుకలా జరుపుకున్నారు.

హైదరాబాద్‌లో జరిగిన ప్రధాన ప్రీమెథాన్ కార్యక్రమానికి ఒలింపిక్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడల్లోనే కాకుండా, జీవిత పోరాటంలో కూడా ఉండే శక్తి, సంకల్పం, స్థితిస్థాపకత (Resilience) స్ఫూర్తిని సైనా తన రాకతో ప్రతిబింబించారు.

కార్యక్రమంలో మాట్లాడి...