Telangana, జూన్ 19 -- తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదిస్తున్న గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు ప్రీ - ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను తిర‌స్క‌రించాల‌ని కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్ కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖను అందజేశారు.

బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్ట్ విష‌యంలో గోదావ‌రి జ‌ల వివాదాల ట్రైబ్యున‌ల్ -1980 (జీడ‌బ్ల్యూడీటీ), ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం - 2014 ల‌కు విరుద్ధంగా ఏపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఫిర్యాదు చేశారు. బనకచర్లపై అభ్యంతరాలతో పాటు నీటి వాటాలకు సంబంధించి అనేక అంశాలను కేంద్రమంత్రికి వివరించారు.

"తెలంగాణ‌కు గోదావ‌రి న‌దిలో 1000 టీఎంసీలు, కృష్ణా న‌దిలో 500 టీఎంసీలు మొత్తంగా 1500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర...