భారతదేశం, జూన్ 12 -- 26 ఏళ్ల యువకుడిని హత్య చేసి మృతదేహాన్ని ఐస్క్రీమ్ ఫ్రీజర్లో భద్రపరిచిన ఘటన త్రిపురలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువకుడు ఒక 20 ఏళ్ల యువతికి బాయ్ ఫ్రెండ్. ఇటీవల ఆ యువతి తండ్రి చనిపోయాడు. ఆ బాధలో ఉన్న యువతికి వారి సమీప బంధువు దగ్గరయ్యాడు. ఆమెతో సంబంధం పెట్టుకోవాలని భావించాడు.అందుకు ఆమె బాయ్ ఫ్రెండ్ అడ్డుగా ఉన్నాడని భావించి, అతడిని హత్య చేశాడు.

పశ్చిమ త్రిపుర ఎస్పీ కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు బంగ్లాదేశ్ కు చెందిన ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్. తన సమీప బంధువు అయిన ఆ యువతి బాయ్ ఫ్రెండ్ ను హతమార్చడానికి పక్కా ప్రణాళిక రచించాడు. జూన్ 8న పశ్చిమ త్రిపురలోని దక్షిణ ఇందిరానగర్ లోని తమ బంధువు ఇంటికి బాధిత యువకుడిని ఆహ్వానించాడు. ఈ హత్యలో తనకు సహకరించడానికి మరో ముగ్గురిని తీసుకువచ్చాడు. వార...