భారతదేశం, జూన్ 16 -- హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణ అనంతరం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ, తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిప్పులు చెరిగారు.

ఏసీబీ విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చిన కేటీఆర్, ఫార్ములా ఈ కార్ రేస్‌ను "ముమ్మాటికీ లొట్టపీసు కేసే" అని అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ, "ఈయన లొట్టపీసు ముఖ్యమంత్రే" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "నాలుగు గోడల మధ్య కాదు, నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దాం అని అసెంబ్లీలో చర్చ పెట్టుమని అడిగాను. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలవాలి అని చెప్పాను. నువ్వు ముందుకు రా? ...