భారతదేశం, ఏప్రిల్ 20 -- దేశంలో పరీక్షల సీజన్​ నడుస్తోంది. అయితే చాలా మంది విద్యార్థులు రాత్రింపగళ్లు కష్టపడి, చదివి మంచి మార్కులు తెచ్చుకుంటుంటే, ఇంకొందరు మాత్రం ఆన్సర్​ షీట్స్​లో డబ్బులు పెట్టి 'పాస్​ చేయించండి' అని రాస్తున్నారు. కర్ణాటకలో జరిగిన 10వ తరగతి (సకెండరీ స్కూల్​ లీవింగ్​ సర్టిఫికేట్​) పరీక్షల్లో ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా బయటకు వచ్చింది. అయితే, విద్యార్థులు ఆన్సర్​ షీట్​లో డబ్బులు పెట్టడమే కాదు, పాస్​ అవ్వకపోతే తన ప్రేమ ఓడిపోతుందని, అందుకైనా పాస్​ చేయించండి అని రాయడం గమనార్హం. ఈ వ్యవహారంపై ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

పలు మీడియా కథనాల ప్రకారం.. కర్ణాటక బెళగావిలో విద్యార్థులు రూ. 500 వరకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారు. తమ డిమాండ్​ని సమర్థించుకునేందుకు అనేక కారణాలు కూడా చెప్పారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి సహాయ...