భారతదేశం, సెప్టెంబర్ 8 -- ట్రిపుల్ ఆర్‌లో భూములు కొల్పోతున్న రైతులు తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల ప్రధాన కార్యాలయంలో బాధిత గ్రామస్తులతో జరిగిన సమావేశంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఓ ప్రైవేటు కంపెనీ యాజమాన్యం కోసం గత ప్రభుత్వం అలైన్‌మెంట్ మార్చిందన్నారు. ఇప్పుడు దక్షిణ భాగం అలైన్‌మెంట్ మారాలంటే ఉత్తర భాగం మారాలన్నారు. ఉత్తర భాగం మారాలంటే.. ప్రభుత్వమే మారాలేమోనని చెప్పారు.

'ప్రభుత్వం భూమిని కోల్పోయిన ప్రజల బాధలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. ముఖ్యంగా చౌటుప్పల్ డివిజన్ గుండా వెళుతున్న ఉత్తర అలైన్‌మెంట్‌లో పరిస్థితి అలానే ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఒక కంపెనీకి ప్రయోజనం చేకూర్చేలా ఆర్ఆర్ఆర్‌ అలైన్‌మెంట్‌ను మార్చారు. ఇప్పుడు దక్షిణ అలైన్‌మెంట్‌ మార్చవలసి వస్తే, ఉత్తర ...