భారతదేశం, అక్టోబర్ 31 -- వాట్సాప్ తన వినియోగదారుల భద్రతను మరింత పెంచే దిశగా మరో అడుగు వేసింది! చాట్ బ్యాకప్‌లను సురక్షితంగా ఉంచేందుకు పాస్‌కీ (Passkey) ఆధారిత ఎన్‌క్రిప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ వాట్సాప్​ కొత్త అప్‌డేట్ వల్ల వినియోగదారులు తమ గూగుల్​ డ్రైవ్​ లేదా ఐక్లౌడ్​లలో సేవ్ చేసిన బ్యాకప్‌లను తమ ఫోన్‌లో ఇప్పటికే ఉన్న సెక్యూరిటీ సిస్టమ్‌ (ఫింగర్‌ప్రింట్, ఫేస్ రికగ్నిషన్, స్క్రీన్ లాక్)తో అనుసంధానించవచ్చు! అంటే, కేవలం ఒక్కసారి ట్యాప్ చేయడం లేదా స్క్రీన్‌పై ఒక చూపుతోనే బ్యాకప్‌ను భద్రపరచవచ్చు. ఆ తర్వాత దాన్ని సులభంగా పునరుద్ధరించుకోవచ్చు.

ఫోన్ పోయినా లేదా మార్చినా కూడా బ్యాకప్‌లు ప్రైవేట్‌గా ఉంటాయని వాట్సాప్ చెబుతోంది.

వ్యక్తిగత సందేశాలు, కాల్స్‌ను రక్షించే వాట్సాప్ అంతర్గత ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వ్యవస్థకు ఈ మార్పు అదనప...