భారతదేశం, మే 4 -- పహల్గామ్​ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్​- పాకిస్థాన్​ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. తమపై భారత్​ ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చని, ఆ దాడిని తాము ప్రతిఘటిస్తామని పాకిస్థాన్​ చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే అలా కనిపించడం లేదని పలు నివేదికలు చెబుతున్నాయి. గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్​ దగ్గర యుద్ధం చేసే స్థాయిలో ఫిరంగి మందుగుండి సామాగ్రి లేదని వార్తా సంస్థ ఏఎన్​ఏ నివేదిక వెల్లడించింది. యుద్ధం వస్తే పాక్​ సైన్యం దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి కేవలం 96 గంటలు (4 రోజులు) మాత్రమే కొనసాగుతాయని తెలిపింది. ఈ విషయం అక్కడి సైనిక వర్గాలనే ఆందోళనకు గురిచేస్తోందని నివేదిక పేర్కొంది.

నివేదిక ప్రకారం.. పాకిస్థాన్​కు ఈ కొరత ఎదురవ్వడానికి కారణాల్లో ఒకటి రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.​​ ఇటీవల ఉక్రెయ...