భారతదేశం, డిసెంబర్ 4 -- కోనసీమకు తెలంగాణ దిష్టి అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో స్పందిస్తుండగా.. తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా స్పందించారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు.

"కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం బాధాకరం. ఇలాంటి మాటలు ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చ గొట్టడమే. ఇది పవన్ గారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. అన్నదమ్ముల్లాంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలను నింపొద్దు" అని వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు.

శంకరగుప్తం డ్రెయిన్ కు ఇరువైపులా గట్లు, డ్రెడ్జింగ్ నిర్మాణాలకు పట్టింపు లేకపో...