భారతదేశం, డిసెంబర్ 2 -- గోదావరి జిల్లాలకు తెలంగాణ దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా పవన్ కామెంట్స్ పై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ. సీరియస్ కామెంట్స్ చేశారు.

పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. పవన్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్చేశారు. తెలంగాణ ప్రజల దిష్టి కాదు.. ఆంధ్రా పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్‌ విషం తాగారన్నారు. పవన్‌ క్షమాపణ చెప్పకపోతే.. ఒక్క సినిమా కూడా ఆడదన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. ఒక్క థియేటర్‌లో కూడా సినిమా విడుదల...