Andhrapradesh, జూన్ 14 -- ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. పొగాకు రైతులకు పరామర్శకు వెళ్తే కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు.రైతుల సమస్యలను పట్టించుకోకుండా. తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి వెళ్లాను. ఆ కార్యక్రమాన్ని డైవర్ట్‌ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా.? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివచ్చారు. మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి.. వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారు" అని విమర్శించారు.

"ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను ...