భారతదేశం, డిసెంబర్ 19 -- ఏపీలో రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురువారంతో ముగిసింది. శాఖల వారీగా పలు అంశాలపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు చెప్పే నెంబర్లు నమ్మనని... ఆకస్మిక తనిఖీలకు వెళ్తానని కలెక్టర్ల కాన్ఫరెన్సులో స్పష్టం చేశారు. ప్రజల సంతృప్తే అధికారుల పనితీరుకు కొలమానమని చెప్పుకొచ్చారు.

ఏప్రిల్ నుంచి సంక్షేమ క్యాలెండర్ అమలు చేయాలని ఈ కాన్ఫరెన్స్ లో నిర్ణయించారు. కేంద్ర నిధులను ఖర్చు చేయడంతోపాటు... అదనంగా రూ. 5 వేల కోట్లు రాబట్టేలా ఫోకస్ చేయాలని సీఎం సూచించారు. ఉత్తమ పద్దతులు అవలంభించిన ఆరు జిల్లాల కలెక్టర్లతో తొలి సారిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించారు. ఆరు ఉత్తమ పద్దతులను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించారు.

22ఏ భూముల పరిష్కారానికి టా...