భారతదేశం, మే 25 -- ఉత్తర్​ప్రదేశ్​లో దారుణ ఘటన జరిగింది. భర్త, అతని తరఫు కుటుంబసభ్యుల వేధింపుల కారణంగా ఓ 23ఏళ్ల మహిళ ప్రాణాలు తీసుకుంది! తన మరణానికి కారణం వారేనంటూ, వీడియో షూట్​ చేసి ఆత్మహత్యకు పాల్పడింది.

యూపీకి చెందిన 23ఏళ్ల అమ్రీన్​ జహాన్ నాలుగు నెలల ముందు ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆమె భర్త బెంగళూరులో వెల్డింగ్​ పనులు చేసుకుంటాడు. పెళ్లి తర్వాత నుంచి అమ్రీన్​ మొరాదాబాద్​లోని అత్తారింటిలో జీవిస్తోంది.

ఇటీవలే ఆమెకు గర్భం పోయింది. అప్పటి నుంచి తన​ని తన భర్త, అతని కుటుంబసభ్యులు వేధించడం మొదలుపెట్టారని అమ్రీన్​ చెప్పింది. మరీ ముఖ్యంగా భర్త తండ్రి, భర్త సోదరి హింసిస్తున్నారని వివరించింది.

"ఒక్కోసారి నా ఆహారపు అలవాట్లను నిందిస్తారు. ఇంకోసారి నా రూమ్​కి కరెంట్​ని కట్​ చేస్తారు. నా చికిత్సకు డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టినట్టు తిడుతుంటారు. ఆ డబ...