Telangana, సెప్టెంబర్ 6 -- బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత. హరీశ్ రావ్, సంతోష్ రావులపై తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కవిత వ్యాఖ్యలపై హరీశ్ రావ్ స్పందించారు. తన రాజకీయ ప్రస్థానం తెెరిచిన పుస్తకం లాంటిదన్నారు. ​కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటమే తన కర్తవ్యమని చెప్పారు.

"నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిది. గత కొంతకాలంగా మా పార్టీపైన, నాపైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలనే వారు (కవిత) కూడా చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను" అంటూ హరీశ్ రావ్ బదులిచ్చారు.

​కేసీఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాలుగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పని చేస్తున్నానని హరీశ్ రావ్ తెలిపారు. రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధ...