భారతదేశం, జనవరి 28 -- భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్యలకు పాల్పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఘటన జరిగింది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఓ వ్యక్తి, అతని భార్య వేధింపులు భరించలేక డెత్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య టార్చర్ తట్టుకోలేక చనిపోయాడని మృతుడి బంధువులు దహన సంస్కారాల పెట్టెపై ఆ విషయం రాశారు.

హుబ్బళ్లిలోని చాముండేశ్వరి నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్య వేధింపులతో విసిగిపోయి పీటర్ అనే వ్యక్తి డెత్ నోట్ రాసి మరణించాడు. చాలా రోజులుగా భర్త పీటర్, భార్య పింకీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసిగిపోయిన పీటర్ ప్రాణాలు తీసుకున్నాడు. వీరిద్దరూ రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారని, పెళ్లయిన మూడు నెలల తర్వాత తరచూ గొడవలు జరగడంతో విడివిడిగా ఉంటున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. పింకీ తన భర్త నుండి విడాకులు కావా...