భారతదేశం, జనవరి 5 -- డ్రంక్ డ్రైవ్ సందర్భంగా తాగుబోతులు చేసే పనులు ఎంత వింతగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఇలాగే హల్‌చల్ చేశాడు. పామును చూపిస్తూ.. ట్రాఫిక్ ఎస్సైని భయపెట్టించే ప్రయత్నం చేశాడు. తనపై కేసు నమోదు చేయవద్దని, తన ఆటోను ఇచ్చేయాలని బెదిరించాడు.

శనివారం రాత్రి హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు చేస్తున్నారు పోలీసులు. ఇదే సమయంలో చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ట్రాఫిక్ ఎస్సై ఎం.ఎ కరీం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ సయ్యద్ ఇర్ఫాన్ మద్యం మత్తులో ఉన్నాడని అనుమానించిన ట్రాఫిక్ పోలీసు అధికారులు అతన్ని ఆపారు. డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్షలో 110 రీడింగ్ వచ్చింది. అతనిపై కేసు నమోదు చేశారు. ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

ఇక ఇర్ఫాన్ తన హంగామా మెుదలుపెట్టాడు. మెుదటగా కేసు వద్దని...