భారతదేశం, ఫిబ్రవరి 3 -- రోజురోజుకు మానవతా విలువలు తగ్గిపోతున్నాయి. ఇందుకు మధ్యప్రదేశ్‌‌లో జరిగిన ఘటనే ఉదాహరణ. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచిన తండ్రి చనిపోయారు. అతడి అంత్యక్రియల విషయంలో సోదరుల మధ్య గొడవ జరిగింది. మృతుడి పెద్ద కుమారుడు.. తండ్రి శవాన్ని రెండు ముక్కలుగా చేయాలని చెప్పాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్‌లోని తికంఘర్ జిల్లాలో జతారా పోలీస్ స్టేషన్‌ పరిధిలోని లిధౌర్ గ్రామంలో తండ్రి అంత్యక్రియల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. తండ్రి అంత్యక్రియలకు సంబంధించి ఇద్దరు సోదరుల మధ్య వివాదం చెలరేగింది. చాలా గంటలపాటు గొడవ కొనసాగింది. వాగ్వాదం పెరిగి తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేయాలని పెద్ద కుమారుడు చెప్పాడు.

లిధౌరా తాల్‌కు చెందిన 85 ఏళ్ల ధ్యాని సింగ్ ఘోష్ ని...