భారతదేశం, డిసెంబర్ 12 -- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడి దయవల్ల తనకు అవకాశం వస్తే ఖచ్చితంగా సీఎం అవుతానని చెప్పుకొచ్చారు. తనకు కూడా ఏదో ఒక రోజు టైమ్ వస్తుందన్నారు. అప్పుడు ఏ ఒక్కరిని కూడా వదలనన్నారు. ఒక్కొక్కళ్ళ తోలు తీస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాను సీఎం అయితే. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని అక్రమాలను బయటకు తీస్తానని కవిత హెచ్చరించారు. తనకో అవకాశం వస్తుందని అప్పుడు ఒక్కొక్కళ్ళ సంగతి చెప్తానని కామెంట్స్ చేశారు. అధికారంలోకి రాగానే అవినీతి పై విచారణ చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

"నాపై అసత్య ఆరోపణలు చేసిన ఎవ్వరిని వదిలిపెట్టను. తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికీ లీగల్ నోటీసులు పంపిస్తా. తెలంగాణ కోసం అవసరం వచ్చినప్పుడు నా నగలు కుదువ పెట్టి బతుకమ్మ చేస...