భారతదేశం, జనవరి 25 -- ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లోని లొసుగుల‌ను ఆస‌రాగా చేసుకొని ప్ర‌భుత్వ భూముల‌ను కొల్ల‌గొట్టిన‌వారిని. రిజిస్ట్రేష‌న్‌ల చ‌లానా సొమ్మును కాజేసిన‌వారిని వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను అడ్డుపెట్టుకొని గ‌త ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు ప్ర‌భుత్వ భూముల‌ను కాజేశార‌ని. దీనిపై సిద్దిపేట‌, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్ర‌భుత్వ అనుబంధ సంస్ధ‌తో పైల‌ట్ కింద ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. ఇందులో అనేక అవినీతి అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు ప్రాథమిక నివేదిక‌లో స్ప‌ష్ట‌మైంద‌ని ఆయ‌న తెలిపారు.

ఈ ఫోరెన్సిక్ నివేదికను ప‌రిశీలించిన త‌ర్వాత మిగిలిన 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వ‌హిస్తామ‌ని మంత్రి పొంగులేటి ప్ర‌క‌టించారు. శనివారం స‌చివాల‌...