Telangana, జూలై 27 -- తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఉన్నత విద్యా మండలి ప్రకటించిన మూడు విడత కౌన్సెలింగ్ పూర్తి కాగా. ఈసారి సీట్లు భారీగానే మిగిలిపోయాయి. అయితే ఈ సీట్లను భర్తీ చేసేందుకు స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షురూ కాగా. మరోవైపు వెబ్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రకారం. ప్రస్తుతం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అర్హులైన విద్యార్థులు జూలై 31లోపు ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన వాళ్లు వెబ్ ఆప్షన్లు(కాలేజీల ఎంపిక) ఎంచుకోవచ్చు. ఈ గడువు కూడా జూలై 31తో ముగుస్తుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు.. తప్పనిసరిగా వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

వెబ్ ఆప్షన్...