Telangana,hyderabad, జూలై 25 -- తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఉన్నత విద్యా మండలి ప్రకటించిన మూడు విడత కౌన్సెలింగ్ పూర్తి కాగా. ఈసారి సీట్లు భారీగానే మిగిలిపోయాయి. అయితే ఈ సీట్లను భర్తీ చేసేందుకు విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీల్లో కలిపి మొత్తం 4.36 లక్షల సీట్లు ఉన్నాయి. మూడు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ తర్వాత.. దాదాపు 2 లక్షలకుపైగా సీట్లు భర్తీ కానట్లు అధికారికి వర్గాల మేరకు తెలిసింది. ఈ నేపథ్యంలో స్పెషల్ ఫేజ్ (ప్రత్యేక విడత కౌన్సెలింగ్) కింద ప్రవేశాలను చేపట్టేందుకు తాజాగానే షెడ్యూల్ ను విడుదల చేశారు.

దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రకారం. ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అర్హులైన విద్యార్థులు జూలై 31లోపు ఈ ప్ర...