భారతదేశం, జనవరి 8 -- అవినీతి కేసుల్లో నమోదైన కొన్ని ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. ఎఫ్ఐఆర్లను రద్దు చేయడానికి హైకోర్టు "అనవసరమైన శ్రమ" తీసుకుందంటూ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

ఏసీబీ నమోదు చేసిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లపై దర్యాప్తు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్‌లు కొట్టేయడం కుదరదని తేల్చి చెప్పింది. రద్దు చేసిన ఎఫ్‌ఐఆర్‌లపై ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుంద్రేష్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.

గత ఏడాది ఆగస్టులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)తో పాటు పలువురు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారించిస్తూ. తీర్పును...