భారతదేశం, డిసెంబర్ 4 -- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ - 2025కు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. 4 వేలకుపైగా ప్రముఖలను ఆహ్వానిస్తోంది. వివిద రంగాలకు చెందిన ప్రముఖలనే కాకుండా దేశ ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానాలు అందజేస్తోంది. ఈ సదస్సును అత్యంత విజయవంతం చేయాలని చూస్తోంది.

ఈ సదస్సు నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. దేశ ఆర్థిక ప్రగతిలో తోడ్పాటును అందించాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం రూపొందించినట్టు ప్రభుత్వం చెబుతోంది. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని సమగ్రమైన ప్రణాళికలతో రోడ్ మ్యాప్‌ను రూపొందించినట్టు పేర్కొంటోంది.

రాష్ట్రాన్ని 20...