Telangana,nizamabad, జూన్ 29 -- కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానికంగా ఉన్న పాలిటెక్నిక్‌ మైదానంలో ఏర్పాటు చేసిన కిసాన్ మహా సమ్మేళన్ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీలపై విమర్శల వర్షం గుప్పించారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతి పార్టీలని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పోయింది కానీ. అవినీతి పోలేదన్నారు.

ఇచ్చిన హామీ ప్రకారం ఎంపీ అర్వింద్‌ నిజామాబాద్‌కు పసుపు బోర్డు సాధించారని అమిత్ షా ప్రశంసించారు. పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరిందన్నారు. దేశంలోని పసుపు రైతులకు అభినందనలు తెలుపుతున్నానని. పసుపు బోర...