Andhrapradesh, జూలై 3 -- తల్లికి వందనం స్కీమ్ పై ఏపీ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. తొలి విడతలో డబ్బులు రాని వారితో పాటు ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన వారికి రెండో విడత కింద డబ్బులను జమ చేయనుంది.

తల్లికి వందనం స్కీమ్ రెండో విడత నిధుల విడుదలపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. జూలై 10న 'తల్లికి వందనం' రెండో విడత నగదు విడుదల చేయాలని నిర్ణయించింది. దీంతో

10న తల్లుల ఖాతాల్లోకి నగదు జమ కానుంది.

ఇప్పటికే రెండో విడతకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ఏపీ సర్కార్ సిద్ధం చేసింది. ఇక మొదటి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిన సంగతి తెలిసిందే.

అర్హులుగా గుర్తించిన విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులను జమ చేస్తున్నారు. ఈ స్కీమ్ కింద మొత్తం రూ. 15 వేలు ఇస్తుండగా. వీటిలో రూ. 13 వేలు తల్లి ఖాతాలో జమవుతాయి. మరో రూ. 2 వేలు జిల్లా కలెక్...