Andhrapradesh, జూలై 9 -- 'తల్లికి వందనం స్కీమ్'పై మరో కీలక అప్డేట్ వచ్చింది. రేపు (జూలై10) రెండో విడత నగదును విడుదల చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. తొలి విడతలో డబ్బులు రాని వారితో పాటు ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన వారికి ఈ విడతలో లబ్ధి చేకూరనుంది.

ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంతోపాటు కేంద్రీయ విద్యాల యాలు, నవోదయ, సీబీఎస్ఈ విద్యా సంస్థల్లో చదువుతున్న 9.51 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ విడతలో డబ్బులను చెల్లించనున్నారు. ఇప్పటికే వీరి సంబంధించిన పేర్లను అర్హుల జాబితాలో పేర్కొన్నారు.

ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాది కలిపి 7,99,410 మంది విద్యార్థులకు సంబంధించి 7,84,874 మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున నగదు జమ చేయనుంది.. ఇటీవల వీరిని మినహాయించి మిగతా వారికి నగదు జమ చేసిన విషయం తెలిసిందే.

కొంతమంది అర్హుల...